GHMC Commissioner Alarming : గ‌ణేష్ ఉత్సవాల నిర్వహణకు నిధులు ఫుల్

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్

Hello Telugu - GHMC Commissioner Alarming

Hello Telugu - GHMC Commissioner Alarming

GHMC : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌రంలో గణేష్‌ ఉత్సవాలు ప్ర‌శాంత‌ వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కోరారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ (R V Karnan) . ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నిధుల కొర‌త లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు. కావాల్సినంత ఉన్నాయ‌ని, వాడుకోవచ్చ‌ని తెలిపారు. గ‌తంలో కంటే ఈసారి మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా , శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలనీ ఆర్ వి కర్ణన్ (R V Karnan) కోరారు. ఈ నెల 27 వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6 వ తేదీన పూర్తి కానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై స‌మావేశం జ‌రిగింది.

GHMC Commissioner Key Comments

ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ వి కర్ణన్ (R V Karnan) మాట్లాడారు. ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. గత సంవత్సరం మాదిరి గానే ఈసారి గణేష్ ఉత్సవాలు ఘ‌నంగా జరిగేలా చూస్తామ‌న్నారు. ఇప్పటికే నగర పరిధిలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే జాతీయ రహదారుల్లో ఏమైనా రోడ్లు రిపేర్ ఉంటే వాటిని కూడా చేపడతామన్నారు. పోలీస్ శాఖ సూచన మేరకు నిమజ్జనం సజావుగా, వేగంగా పూర్తి చేసేందుకు గత సంవత్సరం కంటే ఎక్కువ క్రేన్ లు కూడా ఉపయోగిస్తామని స్ప‌ష్టం చేశారు.

గణేష్ ఉత్సవాల కు బడ్జెట్ ప్రాబ్లం లేదని, వివిధ పనుల నిమిత్తం గతం కంటే కూడా అధిక నిధులు కేటాయిస్తామని, లాజిస్టిక్స్ సమకూర్చుతామని కమిషనర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు తెలిపారు. వేడుక సజావుగా జరిగేందుకు జోనల్ పరిధిలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. గత లోటుపాట్లను సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేష్ ఉత్సవాలను జరిగేలా చూస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్ గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేందుకు పలు సూచనలు చేశారు.

ప్రతి సంవత్సరం భాగ్యనగర్, ఇతర గణేష్ ఉత్సవ సమితి లు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పండుగ సజావుగా జరుపు కుంటున్నామని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున గణేష్ పండా లు, మండపాల నిర్మాణానికి క్వాలిటీ మెటీరియల్ , క్వాలిటీ వైరింగ్ తో సహా నాణ్యమైన లాజిస్టిక్ ఉపయోగించాలని చెప్పారు. ఊరేగింపు సమయంలో ప్రతిమలు అధిక ఎత్తు వ‌ల్ల ఇబ్బందులు ఉంటాయ‌న్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందే రూట్ మ్యాప్ , వాహనం హైట్ ఆధారంగా ప్రతిమలను ప్రతిష్టించాలని కోరారు. ప్రతి మండపం వద్ద కనీసం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేలా చూడాల‌న్నారు. పెద్ద మండపాల్లో ముగ్గురికి తగ్గకుండా వాలంటీర్ సేవలను ఉపయోగించు కోవాలని చెప్పారు. పెద్ద మండపాలలో సందర్శనం కోసం వచ్చే మార్గాలను వేరు వేరు గా ఏర్పాటు చేయాలన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని అన్ని గణేష్ విగ్రహాల ఊరేగింపు సకాలంలో ప్రారంభం అయ్యేలా సహకరిస్తే నిమజ్జనం సజావుగా సాగుతుందని చెప్పారు.

Also Read : Nadendla Manohar – NDA Victory : జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమిదే విజయం

Exit mobile version