Minister Komatireddy Important Update : రూ. 10,547 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం

వెల్ల‌డించిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Hello Telugu - Minister Komatireddy Important Update

Hello Telugu - Minister Komatireddy Important Update

Minister Komatireddy : హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఆయ‌న కీల‌క అప్ డేట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త‌గా హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్ట బోతున్న‌ట్లు తెలిపారు. మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మిస్తామ‌ని చెప్పారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చ‌ని ఖుష్ క‌బ‌ర్ చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి (Minister Komatireddy). వ‌చ్చే 2026 నూతన సంవత్సరంలో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభం అవుతాయని ప్ర‌క‌టించారు.

Minister Komatireddy Venkat Reddy Key Comments

బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచే రోడ్లు తెలంగాణలో నిర్మించ బోతున్నాం అని చెప్పారు. అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలవ బోతోంద‌ని అన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఆర్ అండ్ బి శాఖకు పూర్తి అండగా నిలుస్తున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డికి ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదిలా ఉండ‌గా హ్యామ్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 10,547 కోట్లు అంచ‌నాల త‌యారు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. నిధుల కొర‌త లేద‌ని పేర్కొన్నారు మంత్రి.

Also Read : DY CM Pawan Kalyan Clear Instructions : ఇనాం భూముల రైతుల‌ను సుఖీభ‌వ‌లో చేర్చండి

Exit mobile version