Minister Komatireddy : నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో రైతులు పండించిన పత్తి, మొక్కజొన్న, సోయా బీన్స్, తదితర పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy). నల్లగొండలో కొత్తగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన డివిజనల్ ఆపీస్ , బఫర్ స్టోరేజ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి జోషి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగంచారు మంత్రి. గత యాసంగిలో తెలంగాణ 148 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేసిందని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు.. తుఫాను నష్టం ఉన్నప్పటికీ నల్గొండ మాత్రమే 8.54 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేసిందని స్పష్టం చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
Minister Komatireddy Venkat Reddy Clear Instructions on Farmers Grain Purchase
ఇదే సమయంలో వరి సేకరణను మరింత బలోపేతం చేయడానికి నల్గొండలో ఒక లక్ష మెట్రిక్ టన్నుల అధునాతన నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలని, ఆధునిక గోడౌన్లు, ఆటోమేటెడ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక మిల్లర్లు ఎఫ్ సీ ఐకి ముడి, ఉడక బెట్టిన బియ్యం రెండింటినీ సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వాలని విన్నవించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ తెలంగాణలో అతిపెద్ద తీపి-నారింజ ఉత్పత్తిదారుగా ఉందన్నారు, 17,500 హెక్టార్లలో 4.5 లక్షల టన్నులు సాగు చేయబడుతోందని తెలిపారు. అయినప్పటికీ దీనికి ఇప్పటికీ జాతీయ గుర్తింపు లేదని, తగినంత నిల్వ మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ ఆరెంజ్ కు ODOP హోదా ఇవ్వాలని, 2,500 మెట్రిక్ టన్నుల శీతల గిడ్డంగి సౌకర్యం, సిలోలు, డ్రైయర్లతో కూడిన ఆధునిక వరి గోడౌన్ ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read : CM Chandrababu Important Comments : బీహార్ అభివృద్దిలో దూసుకు పోవడం ఖాయం


















