Minister Kandula Durgesh – Urban Growth : ప‌ట్ట‌ణాల అభివృద్దిపై ప్ర‌భుత్వం ఫోక‌స్

స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

Hello Telugu - Minister Kandula Durgesh - Urban Growth

Hello Telugu - Minister Kandula Durgesh - Urban Growth

Kandula Durgesh : కృష్ణా జిల్లా – కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా ప‌ట్ట‌ణాల‌, న‌గ‌రాల అభివృద్దిపై దృష్టి సారించింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). ఇందుకు సంబంధించి త‌క్ష‌ణ‌మే అందుకు అనుగుణంగా యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ మాస్టర్ ప్లాన్, సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అన్ని రాజకీయ పక్షాల నాయకులతో చర్చించారు మంత్రి. అభివృద్ధి లక్ష్యంగా మున్ముందు కార్యాచరణపై విలువైన సూచనలు, అభిప్రాయాలు ఇస్తే తీసుకుంటామ‌న్నారు.

Minister Kandula Durgesh Key Comments

ప్రతీ పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అనేది మార్గదర్శి పత్రంగా ఉండేలా చూడాల‌న్నారు మంత్రి కందుల దుర్గేష్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ అమలుకు కృషి చేస్తామన్నారు. డ్రైనేజీ సమస్యలు, సుందరీకరణ, పురపాలక భవన ముఖద్వార నిర్మాణం వంటి అంశాలపై వచ్చిన సూచనల్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. వికసిత్ భారత్ – 2047 దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ప్రణాళిక – 2047 అమలుకు, ప్రతి పట్టణ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. ఈ దిశగా నిడదవోలు అభివృద్ధికి ప్రతి ఒక్కరితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ఏపీని ప‌ర్యాట‌క హ‌బ్ గా తీర్చి దిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు రానున్నార‌ని స్ప‌ష్టం చేశారు కందుల దుర్గేష్. సీఎం చంద్ర‌బాబు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ప‌ర్యాట‌క రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంద‌న్నారు.

Also Read : Guvvala Balaraju Shocking Comments : బీఆర్ఎస్ లో నాలాంటి వాళ్ల‌కు స్థానం లేదు

Exit mobile version