Kandula Durgesh : అమరావతి – వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఓటేసి కూటమిని గెలిపించారని అన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి విజయం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఇది తమకు మరింత బలాన్ని ఇచ్చేలా చేసిందని చెప్పారు కందుల దుర్గేష్.కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీ రావడం, వైసీపీకి డిపాజిట్ కూడా దక్కక పోవడం చూస్తుంటే అక్కడి ప్రజలకు వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.
Minister Kandula Durgesh Key Comments
కొన్నేళ్లుగా వాళ్లు స్వేచ్ఛకు , సంతోషానికి దూరంగా ఉన్నారని, ఈ ఎన్నికలతో పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. జగన్ వ్యవహారశైలి అతని పతనానికి నాంది పలికిందన్నారు. ధైర్యంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చామని, ఈ క్రమంలో మూడు దశాబ్దాల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓట్లేశారని చెప్పారు కందుల దుర్గేష్. పులివెందుల ఓటమి జగన్ రెడ్డికి చెంపదెబ్బ అన్నారు. ఈ ఫలితాలతో జగన్ కు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ కూటమిదే విజయమన్నారు. ఇది ప్రజా విజయమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు.
Also Read : Gone Prakash Shocking Comments on Jagan : జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : గోనె
















