Kandula Durgesh : అమరావతి : క్రీడలతో ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం అలవడుతుందని అన్నారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). ఆదివారం రాజ మహేంద్రవరంలోని జిల్లా పోలీసు క్రికెట్ గ్రౌండ్‌లో RJY–Corporate Cup–2025 (Season–3) క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు కందుల దుర్గేష్. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, శారీరక-మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు, స్నేహభావం, సమన్వయం, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించడానికి కూడా దోహదం చేస్తాయన్నారు. ప్రజలలో క్రీడాస్ఫూర్తి పెంచుతూ యువతకు ప్రోత్సాహం అందించడంలో ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు.
Minister Kandula Durgesh Comments
రాజమహేంద్రవరం నగరం రాష్ట్ర క్రీడా రంగంలో మరింత ప్రాధాన్యం పొందాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఆ సందర్బంగా నిర్వాహకులు, ఇందులో పాల్గొన్న జట్లు, క్రీడాభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నానని చెప్పారు. తమ కూటమి ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక, క్రీడా రంగాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. ఇప్పటికే డబుల్ ఇంజన్ సర్కార్ క్రీడలకు అత్యధికంగా ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. ఇదే సమయంలో పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. రేయింబవళ్లు శ్రమిస్తున్నారని , వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని ఏలిన జగన్ మోహన్ రెడ్డి కావాలని పట్టించు కోలేదని ఆరోపించారు. కానీ తాము వచ్చాక దానిని పూర్తిగా మార్చి వేశామన్నారు.
Also Read : Venkaiah Naidu interesting Comments : స్వామినాథన్ ను ఆదర్శంగా తీసుకోవాలి
















