Minister BC Janardhan Reddy Alarming : ఏవియేషన్ హ‌బ్ గా ఆంధ్రప్రదేశ్

మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆకాంక్ష

Hello Telugu - Minister BC Janardhan Reddy Alarming

Hello Telugu - Minister BC Janardhan Reddy Alarming

BC Janardhan Reddy : అమ‌రావ‌తి – దేశానికి రాబోయే రోజుల్లో ఏవియేష‌న్ రంగంలో ఏపీ కేరాఫ్ గా నిలిచేలా చేస్తామ‌న్నారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (BC Janardhan Reddy) . సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన కృషి ఫ‌లించింద‌న్నారు. ప్ర‌ధానంగా ఏవియేషన్ రంగంలో కీలక పెట్టుబడులు రానున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి 9 ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, 2 ప్లైట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని చెప్పారు మంత్రి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు భారీగా వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Minister BC Janardhan Reddy Key Comments

పెట్టుబడుల రాకతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జ‌రుగుతుంద‌ని చెప్పారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి (BC Janardhan Reddy). త‌మ కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న సానుకూల నిర్ణ‌యాల కార‌ణంగానే పెద్ద ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ హ‌బ్ గా మారబోతుందని చెప్పారు. సచివాలయంలోని ఆర్ అండ్ బీ శాఖా కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని పలువురు పెట్టుబడుదారులు, పారిశ్రామికవేత్తలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 సంస్థలు తమ ఆసక్తిని మంత్రికి తెలియ చేశారు.

గతేడాది కాలంలో విజనరీ లీడర్ చంద్ర‌బాబు, డైన‌మిక్ నాయ‌కుడు నారా లోకేష్ కృషి వ‌ల్ల పెద్ద ఎత్తున పెట్టుబ‌డుల ప‌రంగా సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌న్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతుందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా నేడు దేశంలో ప్రముఖ ఏవియేషన్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమని సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండ‌గా స్కై బర్డ్ ఏవియేషన్ ప్రవేట్ లిమిటెడ్ రూ. 600 కోట్లు, ఎఫ్ టీ ఓ, హెలీ టాక్సీ సర్వీసెస్ సంస్థ రూ. 210 కోట్లు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు మంత్రి.

Also Read : Minister Savitha Interesting : బీసీ హాస్టళ్లలో క్రీడలకు ప్రోత్సాహం – స‌విత‌

Exit mobile version