Minister Azharuddin : సౌదీ అరేబియా : మక్కాను సందర్శించేందుకు వెళ్లి బస్సులో ప్రయాణిస్తూ సజీవ దహనమైన హైదరాబాద్ కు చెందిన మైనార్టీల అంత్యక్రియలు శుక్రవారం అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Minister Azharuddin). సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంత్రి సారథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ శాఖ ఉన్నతాధికారులతో కూడిన బృందం ఇప్పటికే సౌదీకి చేరుకుంది. మరో వైపు రాష్ట్ర సర్కార్ అత్యవసర సమావేశం నిర్వహించింది. బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించింది. తమ వారిని కోల్పోయిన వారికి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇదే సమయంలో అంత్య క్రియలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్బంగా మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు.
Minister Azharuddin Gives Important Update on Makkah Incident
అజ్జూ భాయ్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, మైనార్టీ శాఖ కార్యదర్శి బి. షఫియుల్లా సహబ్ , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (CPV & OIA) అరుణ్ కుమార్ ఛటర్జీ, సౌదీ అరేబియాలో భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. అవసరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అజారుద్దీన్. మదీనా షరీఫ్‌లోని జన్నత్-ఉల్-బాఖీలో జరుగుతాయని వెల్లడించారు.
Also Read : Minister Atchannaidu Fired on YS Jagan : జగన్ దుష్ప్రచారం అచ్చెన్న ఆగ్రహం















