Minister Atchannaidu Fired on YS Jagan : జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : అచ్చెన్న‌

ఏపీని స‌ర్వ నాశ‌నం చ‌రిత్ర త‌న‌ది

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Minister Atchannaidu : అమ‌రావ‌తి : జ‌గ‌న్ ఎన్ని మాయ మాట‌లు చెప్పినా జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). గ‌తంలో బీసీల‌ను ఇబ్బందుల‌కు గురి చేసింది మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. వ్య‌వ‌సాయ రంగంపై ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అబ‌ద్ద‌మ‌న్నారు. రైతుల పంటలకు భరోసా ఇవ్వడం, నష్ట పోయిన పంటలకు వెంటనే ఆర్థిక సహాయం అందించామ‌న్నారు. మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముడు కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేసిన పనులను, అమలు చేస్తున్న సంస్కరణలను మాయమాటలతో ఎవరూ కించపరచలేరని మంత్రి అచ్చెన్నాయుడు స్ప‌ష్టం చేశారు. అసత్యాలు ఎంత పెద్దగా చెప్పినా ఎంతసేపు ప్రచారం చేసినా, నిజం ముందు అవి నిలవవని అన్నారు. ప్రజలకు నిజాయితీతో చేసిన పని, రైతులకు అందించిన సహాయం, గ్రామాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్న అభివృద్ధి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.

Minister Atchannaidu Slams YS Jagan

ఖరీఫ్ 2019 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేసి పంటల బీమా పథకం అమలు చేయాలనే ప్రయత్నం చేసినా, అది పూర్తిగా విఫలమైందన్నారు. రబీ 2018-19 తర్వాత రైతులకు ఏ రబీ సీజన్లోనూ కూడా ఎలాంటి బీమా పరిహారం చెల్లించ లేదన్నారు. ఆ తరువాత ఉచిత పంటల బీమా పథకాన్ని నామ మాత్రంగా ప్రకటించి ఖరీఫ్ 2020, ఖరీఫ్ 2021 సీజన్లలో మాత్రమే అమలు చేసి, సంబంధించిన బీమా పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఆపై కేంద్ర ప్రభుత్వ ప్రీమియం సబ్సిడీని పొందేందుకు PMFBYతో సంయుక్తంగా ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి, రైతు ప్రీమియం, రాష్ట్ర సబ్సిడీ రెండింటినీ ప్రభుత్వం తానే బీమా కంపెనీలకు చెల్లిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు అచ్చెన్నాయుడు. ఆ హామీని ఖరీఫ్ 2022 తర్వాత గాలికి వదిలివేసి ప్రీమియం సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వం తీవ్రమైన ఆలస్యం చేసిందన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగా రబీ 2022- 23 నుండి రైతులకు బీమా పరిహారం సరైన సమయానికి చెల్లించలేక, రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు.

Also Read : K Kavitha Fired on Congress Govt : ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం రైతులు ఆగ‌మాగం

Exit mobile version