Minister Atchannaidu : అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకిపారేశారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ది రావడం లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, తన మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లడారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, పారదర్శకత, స్థిరత కోసం కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు ఇచ్చినప్పటికీ, ఆ వాస్తవాన్ని అంగీకరించలేని జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. అభివృద్ధి పయనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దిశా నిర్ధేశక నిర్ణయాలు తీసుకుంటుండగా, దానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశ్యంతో కుట్రలకు పాల్పడడం పట్ల మండిపడ్డారు.
Minister Atchannaidu Slams YS Jagan
కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో చేపట్టిన అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను నమ్మరని ఆ విషయం జగన్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు అచ్చెన్నాయుడు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల సృష్టి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో దారితప్పించే ప్రయత్నాలు ఏవైనా ప్రజల తీర్పు ముందర నిలబడలేవని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతన్నలకు చేదోడుగా ఉంటూ మరింత సేవలు అందిస్తూ కర్షకుల మన్ననలు పొందుతున్నదని చెప్పారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం గురించి వివరాలు వెల్లడించారు. రైతాంగానికి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీకి అనుగుణంగా భూ యజమానులు, అటవీ భూమి సాగుదారులకు ఇప్పటివరకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండు విడుతలు కలిపి రూ. 14 వేల చొప్పున జమ చేశామన్నారు.
Also Read : Janasena Sensational – Local Body Elections : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ
