Janasena : హైదరాబాద్ : పవర్ స్టార్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సారథ్యంలోని జనసేన పార్టీ (Janasena) అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా దృష్టి సారించింది. ఆ పార్టీని కింది స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తరపున తమ పార్టీ నుంచి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం, బీజేపీతో కలిసి జనసేన మంత్రివర్గంలో పాలు పంచుకుంటోంది. ఇదే ఫార్మూలాతో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది.
Janasena Participates in Telangana Local Body Elections
ఇందులో భాగంగా తాజాగా నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాల నాయకులతో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వం నుండి ప్రజలకు అందాల్సిన పథకాలపై ప్రజల పక్షాన నిలబడుతూ అందర్నీ కలుపుకొని పార్టీని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. నాయకులు అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో కూకట్పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ , ఖమ్మం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ , వీర మహిళల విభాగం చైర్మన్ మండపాక కావ్య పాల్గొన్నారు.
Also Read : Minister Komatireddy Clear Instructions : రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : కోమటిరెడ్డి
