Minister Atchannaidu : అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) సంచలన ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష చేపట్టారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమై ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నారు. దీనిపై ఇప్పటికే కీలక ఆదేశాలు తమ సర్కార్ నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు జారీ చేశారని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇదే సమయంలో రైతులకు తీపి కబురు చెప్పారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు మోదీ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు.
Minister Atchannaidu Key Comments
ఈ నెల 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు అచ్చెన్నాయుడు. కాగా అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రాష్ట్ర సీఎస్ విజయానంద్ కు. NPCAలో ఇన్ యాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు కింజరాపు అచ్చెన్నాయుడు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత 46,62,904, లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. మొత్తం రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ. 7 వేలు వేస్తామన్నారు.
Also Read : Bangladesh Court Shocking Verdict : మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష ఖరారు
