Minister Anitha : అమరావతి – ఏపీలో ఇక నుంచి ఎక్కడ డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha). శనివారం యస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో పర్యటించారు. అంతకు ముందు ధర్మవరంలో శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజులు చేశారు.
సుపరిపాలనలో తొలి అడుగుకు శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు దీనికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే టీడీపీ విస్తృత స్తాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి ఏర్పడి ఏడాది అయ్యింది. ఈ క్రమంలో తమ సర్కార్ తీసుకు వచ్చిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు పోవాలని పిలుపునిచ్చారు.
Minister Anitha Shocking Comments
తమ అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఊర్లలో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని చెప్పారు ఈ సందర్బంగా టూర్ లో ఉన్న మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha). ఇంటింటికి వెళ్ళి ఏడాడి కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు మహిళలు. గ్రామస్తులతో ముఖా-ముఖీలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ధర్మవరం గ్రామానికి చెందిన యువకుడు పల్లా అప్పలరాజుకు ఇటీవలే రోడ్డు ప్రమాదం జరిగింది. బాధితుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఇప్పుడు ఎన్నికలు లేవన్నారు. ప్రజలు యోగ క్షేమాలు తెలుసు కోవడానికి ధర్మవరం వచ్చానని చెప్పారు వంగలపూడి అనిత. ధర్మవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో సర్పంచ్ లకు అధికారాలు లేవన్నారు. గత ఐదు సంవత్సరాలు ధర్మవరంలో ఒక రోడ్డు వేయలేదన్నారు. నాడు-నేడు పేరుతో డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నో పాఠశాలలో శిథిలావస్థలో ఉన్నాయని ఫైర్ అయ్యారు. గతంలో సరైన విత్తనాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గతంలో సర్పంచ్ లకు కనీసం బ్లీచింగ్ పౌడర్ జల్లడానికి కూడా డబ్బులు లేవన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభం అవుతుందన్నారు.
Also Read : YS Jagan Shocking Comments : 100 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఫైనల్ : జగన్















