మెస్సీ జీవితం వేలాది మందికి స్పూర్తి దాయ‌కం

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

hellotelugu-CMrevanthReddy

హైద‌రాబాద్ : ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు లియోనెల్ మెస్సీ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న జీవితం ఎంద‌రికో స్పూర్తిగా నిలుస్తుంద‌ని అన్నారు. త‌నతో క‌లిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌డం జీవితంలో మ‌రిచి పోలేన‌ని అన్నారు సీఎం. గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్ గా, అర్జెంటీనా కెప్టెన్ గా లియోనెల్ మెస్సీ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పర్యటన సందర్భంగా క్రీడా అభిమానులను ఆకట్టుకున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా సీఎం సింగరేణి RR9 జట్టు అపర్ణ ఆల్ స్టార్స్ జట్టును 4–0 తేడాతో ఓడించి విజయం సాధించింది. రేవంత్ రెడ్డి స్వయంగా ఒక గోల్ సాధించారు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఈ మ్యాచ్ స్టేడియంకు అపారమైన శక్తిని, ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది, అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేశారు.మెస్సీ జట్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు . మైదానంలో పిల్లలతో హృదయ పూర్వకంగా సంభాషించారు. యువ అభిమానుల ఆటగాళ్లతో చిరస్మరణీయ క్షణాలను సృష్టించారు. 14 సంవత్సరాల విరామం తర్వాత మెస్సీ భారతదేశంలో ఉండటం హైదరాబాద్ అంతటా క్రీడా ప్రియులను మంత్ర ముగ్ధులను చేసింది. ఆయనతో పాటు ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్లు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా) , లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) కూడా పాల్గొన్నారు.

Exit mobile version