ఏపీలో1.08 లక్ష‌ల మందికి వైద్య సేవ‌లు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు

hellotelugu-CM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు పొందారని అన్నారు. 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేయగా, 19 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. సంజీవని ప్రాజెక్టు వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సేవల్ని డిజిటలైజ్ చేసినా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆశించిన స్థాయిలో పనిచే యకుంటే ఫలితాలు రావని ముఖ్యమంత్రి అన్నారు.

దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజారోగ్య రక్షణకు సంబంధించి ప్రచారం జరగడం లేదన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గించు కునేందుకు అవకాశం కలుగుతుందని సీఎం అన్నారు. అనీమియా, డయాబెటిస్ వంటి వ్యాధులు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉందన్నారు. జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేట్ 2.1 నుంచి 1.5కి తగ్గిందని, అత్యధికంగా కడప జిల్లాలో 1.99 ఫెర్టిలిటీ రేట్ ఉంటే, అత్యల్పంగా 1.32 విశాఖపట్నంలో నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఫెర్టిలిటీ రేటు 2.1 లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, లక్ష్యం కన్నా 6 శాతం తక్కువలో ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. తల్లికి వందనం పాపులేషన్ మేనేజ్మెంట్‌ కార్యక్రమంలో భాగమేనని చెప్పారు. మన దేశ కుటుంబ వ్యవవ్థ పటిష్టంగా ఉందని… దీనిని కాపాడు కునేందుకు మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరించకుండా చూడాలన్నారు సీఎం. ఉమ్మడి-పెద్ద కుటుంబాలకు అధిక ప్రోత్సాహకాలు ప్రణాళిక రూపాందించాలని సీఎం సూచించారు.

Exit mobile version