Mcdonalds Huge Investment : హైదరాబాద్ లో మెక్‌డొనాల్డ్స్ రూ. 873 కోట్లు ఇన్వెస్ట్

2,000 ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంస్థ

Hello Telugu - Mcdonalds Huge Investment

Hello Telugu - Mcdonalds Huge Investment

Mcdonalds : ప్ర‌ముఖ అమెరికా దిగ్గ‌జ సంస్థ మెక్ డొనాల్డ్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్,ఏరో స్పేస్, ఆటో మొబైల్స్ రంగాల‌కు కేరాఫ్ గా మారిన హైద‌రాబాద్ లో త‌మ సంస్థ భారీగా పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు అధికారికంగా దాదాపు రూ. 873 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామ‌ని తెలిపింది. దీని ద్వారా 2, 000 మందికి పైగా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా జాబ్స్ రానున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. సరసమైన బర్గర్‌లు , క్రిస్పీ ఫ్రైస్‌లకు ప్రసిద్ధి చెందింది అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కంపెనీ.

Mcdonalds Huge Investment

ఈ పెట్టుబ‌డి ప్ర‌ధానంగా మెక్‌డొనాల్డ్స్ (Mcdonalds) తన గ్లోబల్ టెక్నాలజీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి వినియోగించ‌నుంది. ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్‌లు, సైబర్ సెక్యూరిటీ, డేటా సిస్టమ్‌లపై దృష్టి సారించ‌నుంది. అయితే స‌ద‌రు సంస్థ గ‌త మూడు నెల‌ల కింద‌ట కార్యక‌లాపాల‌ను ప్రారంభించింది కొత్త‌గా హైద‌రాబాద్ లో. ప్ర‌స్త‌తం ఈ సంస్థ‌లో 100 మంది ప‌ని చేస్తున్నారు. ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌తో 2027 ప్రారంభంలో 2 వేల‌కు పైగా ఉద్యోగాల క‌ల్ప‌న ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.

ప్రస్తుతం హైదరాబాద్ హబ్ గ్లోబల్ ఫైనాన్స్, పీపుల్ సర్వీసెస్ వంటి కీలకమైన కార్పొరేట్ విధులను నిర్వహిస్తుంది. అంతే కాకుండా మెక్ డొనాల్డ్స్ కంపెనీ డేటా ఇంజనీరింగ్, గవర్నెన్స్, ఇన్‌సైట్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి కీలకమైన కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ కార్యాలయం ఇప్పటికే ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఈ సంద‌ర్బంగా సంస్థ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ (ఆపరేషన్స్) హెడ్ దేశాంట్ కైలా స్పందించారు. భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ యాప్‌ను ఉపయోగిస్తే అది ఇతర దేశాలలో పనిచేయదు. మేము ఏకీకృత గ్లోబల్ యాప్‌ను నిర్మించాలని అనుకుంటున్న‌ట్లు చెప్పారు.

Also Read : LV Subramanyam Shocking Comments : గంట‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం అసంభ‌వం – ఎల్వీ

Exit mobile version