Beauty Manika Vishwakarma – Miss India 2025 : మిస్ ఇండియాగా మ‌ణిక విశ్వ‌క‌ర్మ

రాజ‌స్థాన్ కు చెందిన మోడల్

Hello Telugu - Beauty Manika Vishwakarma - Miss India 2025

Hello Telugu - Beauty Manika Vishwakarma - Miss India 2025

Manika Vishwakarma : రాజ‌స్థాన్ కు చెందిన మ‌ణిక విశ్వ‌క‌ర్మ సంచ‌ల‌నంగా మారారు. ఆమె మిస్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఇదిలా ఉండ‌గా ఈ సంవత్సరం చివర్లో థాయిలాండ్‌లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించ‌నుంది ఆమె. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన వేడుకలో మణిక‌ విశ్వకర్మను (Manika Vishwakarma) అవుట్ గోయింగ్ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కిరీటాన్ని అలంకరించింది. ఈ భార‌తీయ సుంద‌రి వ‌య‌సు కేవ‌లం 22 ఏళ్లు మాత్ర‌మే. ఈ సంద‌ర్బంగా త‌ను స్పందించింది. త‌ను జీవితంలో ఊహించ లేద‌ని తెలిపింది.

Manika Vishwakarma Gets a Miss India 2025 Title

ఈ అనుభూతి చాలా అద్భుతంగా ఉంద‌ని పేర్కొంది మణిక విశ్వ‌క‌ర్మ‌. ఈ ప్రయాణం అద్భుతంగా ఉందన్నారు. ఈ సంద‌ర్బంగా మిస్ ఇండియాగా గెలుపొంద‌డం సంతోషంగా ఉంద‌ని, త‌ను ఈ స్థాయిలో నిలిచేందుకు స‌హ‌క‌రించిన గురువులు, త‌ల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబీకుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో భారతదేశాన్ని అత్యుత్తమంగా ప్రాతినిధ్యం వహించడానికి, కిరీటాన్ని ఇంటికి తీసుకు రావడానికి నా వంతు కృషి చేయడమే నా ముంద‌న్న ల‌క్ష్య‌మ‌న్నారు.

నా ప్రయాణం గంగానగర్‌లో ప్రారంభమైంద‌న్నారు మ‌ణిక విశ్వ‌క‌ర్మ‌. మ‌నల్ని మ‌నం ప్రేమించుకుంటే మ‌న‌లో ఆత్మ విశ్వాసం మ‌రింత క‌లుగుతుంద‌న్నారు భార‌తీయ సుంద‌రి. పోటీ అనేది కేవలం ఒక రంగం కాదు. ఇది మిమ్మల్ని ఒక పాత్రగా మార్చే ప్రపంచం. మీ జీవితాంతం, మీరు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అవకాశాన్ని పొందుతారన‌ని, అందుకే తాను అడుగు పెట్టాన‌ని చెప్పారు.

Also Read : Murugadoss Shocking Comments : స‌ల్మాన్ ఖాన్ పై మురుగ‌దాస్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version