Manchu Lakshmi Shocking Comments : డ్రెస్సింగ్ సెన్స్ పై మంచు ల‌క్ష్మి కామెంట్స్

ఇదే ప్ర‌శ్న మ‌హేష్ బాబును అడుగుతారా

Hello Telugu - Manchu Lakshmi Shocking Comments

Hello Telugu - Manchu Lakshmi Shocking Comments

Manchu Lakshmi : ప్ర‌ముఖ న‌టుడు మ‌హేష్ బాబు త‌న‌య మంచు ల‌క్ష్మి (Manchu Lakshmi) షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న వేష ధార‌ణ‌పై ఓ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌కు ఘాటుగా స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. పూర్తిగా పురుషాధిక్య స‌మాజంలో ఉన్నామ‌ని పేర్కొంది. త‌న దుస్తుల గురించి మీరు అడుగుతున్నారు స‌రే ఇదే ప్రశ్న‌ను స్టార్ హీరో మ‌హేష్ బాబు ను అడుగ గ‌ల‌రా అని నిల‌దీశారు. నటి మంచు లక్ష్మి 47 సంవత్సరాల వయసులో తన డ్రెస్సింగ్ సెన్స్‌ను ప్రశ్నించినందుకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. త‌ను న‌టించిన రాబోయే చిత్రం ద‌క్ష ఎ డెడ్లీ కాన్ స్పిర‌సీ ని ప్ర‌మోట్ చేస్తోంది. ఈ మూవీ ఈనెల 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Manchu Lakshmi Comments Viral

ఒక ప్రమోషనల్ ఇంటరాక్షన్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఆమె 50 ఏళ్లకు దగ్గరగా ఉందని ఎత్తి చూపుతూ ఆమె దుస్తుల ఎంపిక గురించి ప‌దే ప‌దే అడిగాడు. మంచు లక్ష్మి ప్రశాంతంగా నే జ‌వాబు ఇచ్చింది. కానీ దృఢంగా స్పందించింది. నవ్వుతూనే షాక్ ఇచ్చింది. నా దుస్తుల గురించి అడిగే ధైర్యం ఎలా వ‌చ్చిందంటూ ప్ర‌శ్నించింది. స‌ద‌రు జర్నలిస్ట్ అంతరాయం కలిగించడానికి ప్రయత్నించగా, ఆమె మర్యాదగా అతన్ని ఆపింది. మహేష్ బాబును అదే ప్రశ్న అడుగుతారా అని అడిగింది. మీకు ఇప్పుడు 50 ఏళ్లు, మీరు చొక్కా లేకుండా ఎందుకు వెళ్తున్నారని ప్రిన్స్ ను ప్ర‌శ్నిస్తారా అని నిల‌దీసింది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేశారు.

ఒక స్త్రీ అపారమైన బాధ్యతను మోస్తుంది. ఎవరూ మనకు స్వేచ్ఛ ఇవ్వరని ,దానిని మనమే పొందాల్సి ఉంటుంద‌న్నారు మంచు ల‌క్ష్మి.

Also Read : Mirai Movie Sensational Collections : మిరాయ్ సంచ‌ల‌నం కాసుల వ‌ర్షం

Exit mobile version