Manchu Lakshmi Shocking : ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన మంచు లక్ష్మీ

మూడున్న‌ర గంట‌ల‌కు పైగా విచార‌ణ

Hello Telugu - Manchu Lakshmi Shocking

Hello Telugu - Manchu Lakshmi Shocking

Manchu Lakshmi : హైద‌రాబాద్ – బెట్టింగ్ యాప్స్ కేసులో బుధ‌వారం న‌టి మంచు ల‌క్ష్మీ ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. పలు గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్ చేశారు. ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అంటూ సోషల్‌ మీడియాలో ప్రమోషన్లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పికే ఈ కేసులో సినీ న‌టీన‌టుల‌తో పాటు సోష‌ల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ పై కేసులు న‌మోద‌య్యాయి. మ‌నీ లాండ‌రింగ్ కింద ఈడీ ద‌ర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌కాశ్ రాజ్, ద‌గ్గుబాటి రానా హాజ‌ర‌య్యారు. ముగిసిన మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఈడీ విచారణ..

Manchu Lakshmi Attends Betting Apps Case Investigation

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో దాదాపు మూడున్నర గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. ఈ సంర‌ద్బంగా త‌న‌కు సంబంధించిన ఐదేళ్ల బ్యాంక్ లావాదేవీలను ఇవ్వాల‌ని కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాల‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు అంద‌జేశారు మంచు ల‌క్ష్మి. ఇదిలా ఉండ‌గా తమ ముందు హాజరు కావాలని ఆమెకు జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందనగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా డబ్బు సులభంగా సంపాదించవచ్చని ఆమె అన్నారు. కాగా బెట్టింగ్ యాప్ కేసులో ప‌లువురు న‌టులు హాజ‌ర‌య్యారు. వీరిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయి.

న‌గ‌రానికి చెందిన పీఎం ఫణీంద్ర శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా 318(4), 112 రీడ్ విత్ 49 BNS , సెక్షన్ 3, 3(A), 4 ఆఫ్ TS గేమింగ్ యాక్ట్ , సెక్షన్ (D) ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Also Read : Mothevari Love Story Series Sensational : జీ5 ఓటీటీలో మోతేవారి ల‌వ్ సూప‌ర్

Exit mobile version