హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, నయనతార కలిసి నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు దుమ్ము రేపుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న సోమవారం ప్రవంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత చిరంజీవికి సక్సెస్ దక్కేలా చేశాడు దర్శకుడు. ఈ సందర్బంగా తనకు కేక్ తినిపించాడు స్వయంగా స్టార్ హీరో. టేకింగ్, మేకింగ్ ల తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు ఓ స్పెషల్ రోల్ లో అలరించాడు, ఆకట్టుకున్నాడు విక్టరీ వెంకటేశ్ . తనతో పాటు అందాల తార నయనతార సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఇదిలా ఉండగా విడుదలైన రెండో రోజు కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం. ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బులు రావడం విశేషం. మరో వైపు దీనికి పోటీగా ముందుగా విడుదలైన ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఎత్తి పోయింది. దర్శకుడు మారుతిపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక దర్శకుడు అనిల్ వరకు వస్తే పూర్తిగా కామెడి, ఎంటర్ టైనర్ , మ్యూజికల్ గా తారా స్థాయికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జనం రాజా సాబ్ కంటే మన శంకర వర ప్రసాద్ గారు మూవీని తీసేందుకు జనం బారులు తీరుతున్నారు. ఒక రకంగా ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కుతుందని అంటున్నారు. ఏది ఏమైనా తొలి రోజు కలెక్షన్స్ రూ. 84 కోట్లు దాటడం విశేషం కదూ.


















