Mamitha Baiju : సినీ రంగంలో ఎవరు ఎప్పుడు టాప్ లోకి వస్తారో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన నటి పూజా హెగ్డే ఇప్పుడు అడపా దడపా సినిమాలు మాత్రమే చేస్తోంది. తను షాహిద్ కపూర్ తో కలిసి నటించిన మూవీ ఆశించిన మేర ఆడలేదు. అంతకు ముందు సల్మాన్ ఖాన్ తో చేసిన సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఇదే సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో ఏఆర్ మురుగదాస్ సల్మాన్ భాయ్ తో తీసిన సికిందర్ బొక్క బోర్లా పడింది. ఇదే సమయంలో కోలీవుడ్ యాక్టర్ ధనుష్, టాలీవుడ్ అందాల నటుడు అక్కినేని నాగార్జునతో కలిసి శేఖర్ కమ్ముల తీసిన కుబేర చిత్రంలో కీ రోల్ పోషించింది. ఈ మూవీ రూ .100 కోట్లు వసూలు చేసింది. ఇందులో భిక్షగాడి పాత్రకు జీవం పోశాడు నటుడు ధనుష్. తాజాగా తన సినీ కెరీర్ లో మరో కొత్త మూవీతో ముందుకు రానున్నాడు.
Mamitha Baiju Shocking to Pooja Hegde
ఇందులో మొదటగా పూజా హెగ్డే అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ అనుకోకుండా దర్శక, నిర్మాతలు ఎందుకనో తనను పక్కన పెట్టేశారు. ప్రేమలు సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మలయాళ కుట్టి మమిత బైజును (Mamitha Baiju) తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో కోలుకోలేని షాక్ కు గురైంది పూజా హెగ్డే. తమిళ సినిమాలలో కూడా నటించింది..మెప్పించింది పూజా హెగ్డే. తను సినీ కెరీర్ ను మొదటగా కోలీవుడ్ నుంచే స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగింది. టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తను బన్నీతో నటించిన త్రివిక్రమ్ తీసిన అల వైకుంఠ పురంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు, ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్, వరుణ్ తేజ్ , వెంకటేశ్ తో కలిసి నటించింది. కానీ ఎందుకనో తనకు లక్ ఆశించిన మేర దక్కడం లేదు.
తాజాగా మలయాళ భామ మమత బైజుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంతో కొత్త మూవీలో నటించనుంది. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది. 2026 ప్రారంభంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Also Read : Hero Karthi-Kalyani Priyadarshan : కార్తీతో జత కట్టిన కళ్యాణి ప్రియదర్శన్



















