సీఎం సువేందు అధికారిపై మ‌మ‌తా బెన‌ర్జీ సీరియ‌స్

చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య త‌ప్ప‌క ఉంటుంద‌ని గుర్తు పెట్టుకో

hellotelugu-MamataBanarjee

కోల్ క‌తా : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కురాలు, మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఏ ఒక్క‌రికీ శాశ్వ‌తం కాద‌ని, ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్య‌మ‌ని అన్నారు. ఆదివారం మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం బార‌తీయ జ‌న‌తా పార్టీ ఎలా రాష్ట్రంలో ఓట్లు తొల‌గించి, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డి అధికారంలోకి వ‌చ్చిందో రాష్ట్ర ప్ర‌జ‌లే కాదు యావ‌త్ భార‌త దేశం గుర్తించింద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తుంటార‌ని ఏదో ఒక రోజు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు మ‌మ‌తా బెనర్జీ. ఆమె ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు సీఎం సువేందు అధికారి గురించి.

మీరు ముఖ్యమంత్రి. కానీ మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. 10 లేదా 11 ఏళ్లపాటు టీఎంసీ (TMC)లో ఉన్నారు. టీఎంసీ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పని చేశారు. మీరు నీటిపారుదల , రవాణా శాఖల మంత్రిగా వ్యవహరించారు. పార్టీ తరపున ఆరు జిల్లాల బాధ్యతలు కూడా చూసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారం ఉంది క‌దా అని త‌మ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ఏమైనా క‌సి , కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డాల‌ని అనుకుంటే త‌న‌పై పాల్ప‌డాల‌ని అన్నారు.

Exit mobile version