తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జులై 6వ తేదీన సోమవారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గం||ల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకు రావచ్చు. ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకు రాదలచిన వినియోగదారులు తమ వద్ద విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది ఏపీఎస్పీడీసీఎల్.
ఇదిలా ఉండగా డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గం||ల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకు వచ్చేందుకు వీలుగా వినియోగదారులు ఈ క్రింద పేర్కొన్న నంబర్లకు కాల్ చేయాలని సూచించింది విద్యుత్ వినియోగదారులకు . తిరుపతి వాసులు 8712652679 అనే నెంబర్ కు , చిత్తూరు జిల్లాకు చెందిన వినియోగదారులు 7993147979, నెల్లూరు జిల్లాకు చెందిన వారు 08612320427, అన్నమయ్య జిల్లాకు చెందిన వారు 9440817449, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వినియోగదారులు
08562242457 అనే నెంబర్ కు , కర్నూలు జిల్లా వినియోగదారులు 7382614308, నంద్యాల జిల్లాకు చెందిన వినియోగదారులు 7382618976, అనంతపురం జిల్లాకు చెందిన వారు 9154790350 అనే నెంబర్ కు,
శ్రీసత్యసాయి జిల్లా వాసులు 9490615721 మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు సీఎండీ శివ శంకర్ లోతేటి.
