హైదరాబాద్ : దిగ్గజ దర్వకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారణాసి. గత రెండు సంవత్సరాలుగా తను ఒక్కడి కోసమే టైం కేటాయించాడు ప్రముఖ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు. తనతో పాటు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ , తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటి లాగే తన మూవీకి సంగీతం అందిస్తున్నారు ఎంఎం కీరవాణి. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి. ఇటీవల నటి ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన కపిల్ శర్మ షో లో ఎవరూ ఊహించని విధంగా జక్కన్న మూవీ వారణాసిని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోందని పేర్కొంది. ఏకంగా రూ. 1300 కోట్లతో తీస్తున్నారంటూ బాంబు పేల్చింది. ఇక ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసేలా చేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా రాబోయే 2027లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. దీనిని అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. మరో వైపు జపాన్ దేశంలో కూడా వారణాసిని రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. దీంతో చిత్ర నిర్మాతలు వారణాసి చిత్రాన్ని కూడా జపాన్‌లో థియేటర్లలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం ఇంకా షూటింగ్ పూర్తి చేయనప్పటికీ, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల మాట్లాడారు. చిత్రీకరణలో చాలా భాగం ఇంకా మిగిలి ఉందని, వచ్చే ఏడాది దానిని పూర్తి చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని వెల్లడించారు.


















