హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ వార్త గుప్పుమంటోంది. ప్రిన్స్ మహేష్ బాబు దమ్మున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున ఊహాగానాలకు తెర లేపారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత జనాదరణ పొందిన దర్శకులలో కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రశాంత్ నీల్ ఉండగా ఇక మోస్ట్ పాపులర్ హీరోగా ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నారు. ఆయన ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. దీనిని వరల్డ్ వైడ్ గా త్వరలో విడుదల చేయనున్నారు. తనతో పాటు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా ఇందులో కీ రోల్ పోషిస్తోంది.
ఇప్పటికే ఫోటోలు, గ్లింప్స్ దుమ్ము రేపుతోంది. ఇక ప్రశాంత్ నీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను తీసింది ఇప్పటి వరకు కొన్ని సినిమాలే. కానీ తనలో వస్తున్న సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. యశ్ తో తీసిన కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేసింది. ప్రభాస్ తో తీసిన సలార్ దుమ్ము రేపింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తీశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఇందులో రుక్మిణీ వసంత్ , జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే గత కొంత కాలం పాటు రాజమౌళితో ప్యాకప్ అయ్యాడు. ఇప్పుడు మహేష్ బాబు ఒక ప్రాజెక్ట్ కోసం నీల్‌తో జతకట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమో లేక కేవలం ఊహాగానమో ప్రస్తుతం స్పష్టంగా తెలియలేదు. మహేష్ బాబు, ప్రశాంత్ నీల్‌ల మధ్య ఏదైనా కలయిక కార్యరూపం దాల్చడానికి రెండు సంవత్సరాలు పట్టవచ్చు. కాగా దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అటు దర్శకుడు నీల్ కానీ ఇటు మహేష్ బాబు కానీ.
