Hero Mahesh babu – Varanasi : నా తండ్రి కోరిక వార‌ణాసితో నెర‌వేరింది

న‌టుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు కామెంట్స్

Hello Telugu - Hero Mahesh babu - Varanasi

Hello Telugu - Hero Mahesh babu - Varanasi

Mahesh babu : హైద‌రాబాద్ : న‌టుడు మ‌హేష్ బాబు (Mahesh babu) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియోలో జ‌రిగిన గ్లోబ్ ట్రాట్ట‌ర్ మూవీ ట్రైల‌ర్, టైటిల్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. త‌న తండ్రి దివంగ‌త న‌టుడు కృష్ణ త‌న‌ను పౌరాణిక సినిమాలు చేయమని అడిగాడని, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా వారణాసి మూవీతో ఆ కోరిక తీరింద‌న్నారు. ప్ర‌త్యేకించి త‌న అభిమానుల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు మ‌హేష్ బాబు. మీ ప్రేమ, ఆప్యాయతకు తాను ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడి గురించి కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు మహేష్ బాబు. త‌న‌ను పసుపు చొక్కా, గోధుమ రంగు బ్యాగీలు ధరించమని చెప్పాడని చ‌మ‌త్క‌రించాడు. ఆయ‌న సూచ‌న‌ల‌ను పాటించాన‌ని, అయితే చొక్కా లేకుండా రావాల‌ని అడ‌గ‌లేద‌న్నాడు.

Hero Mahesh babu Varanasi Movie

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళితో ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. ఒక నటుడు ఎలా ఉండాలో ఎలా ఉండ కూడ‌దో త‌న‌ను నుంచి నేర్చుకునే వీలు క‌లిగింద‌ని చెప్పాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు. త‌ను అసాధార‌ణ‌మైన ప్ర‌తిభా నైపుణ్యం క‌లిగిన అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు జ‌క్క‌న్న‌పై. వార‌ణాసి చిత్రం భార‌త దేశం గ‌ర్వ‌ప‌డేలా చేస్తుంద‌ని ఇందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేద‌న్నాడు. ఈ ఈవెంట్ కేవ‌లం టైటిల్ ను వెల్ల‌డించడానికి మాత్ర‌మే ఏర్పాటు చేశామ‌న్నాడు మహేష్ బాబు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని విన్యాసాల‌కు వేదిక అవుతుంద‌న్నాడు. మీ అంద‌రి మ‌ధ్య నా తండ్రీ పైనుండి న‌న్ను ఆశీర్వ‌దిస్తున్నాడ‌ని చెప్పాడు.

Also Read : Minister Kandula Durgesh Strong Focus : ప‌ర్యాట‌క రంగంపై స‌ర్కార్ ఫోక‌స్ : కందుల దుర్గేష్

Exit mobile version