Mahavatar Narsimha : యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహా (Mahavatar Narsimha) సంచలనం సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసి విస్తు పోయేలా చేసింది సినీ ఇండస్ట్రీని. ఈ సందర్బంగా దర్శకుడు అశ్విని కుమార్ స్పందించాడు. మీడియాతో మాట్లాడారు. హిరణ్య కశ్యపుని పాత్రకు సరిగ్గా ఇద్దరు నటులు సరిపోతారని తెలిపాడు. ఇందులో ఒకరు తమిళ సినీ రంగానికి చెందిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాగా మరొకరు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన రానా దగ్గుబాటి అని పేర్కొన్నారు. నరసింహ ఎప్పుడూ డిజిటల్ యానిమేషన్ లోనే ఉంటాడు ఎందుకంటే ఎవరూ అతని పాత్ర పోషించలేరంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Mahavatar Narsimha Movie Updates
కాగా తను తీసిన పౌరాణిక యానిమేటెడ్ చిత్రం మహావతార్ నర్సింహ రక్షా బంధన్ వారాంతంలో ప్రేక్షకులలో భారీ పెరుగుదలను చూసింది. అంతే కాదు వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. నరసింహ పాత్రను చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదు. హావ భావాలను పలికించడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. అయితే హిరణ్య కశ్యపుడి పాత్రకు ఆ ఇద్దరూ సరిగ్గా సరిపోతారని స్పష్టం చేశాడు అశ్విని కుమార్. కొన్ని పాత్రలు అలాగే ఉండి పోతాయి శాశ్వతంగా ప్రజల్లో. ఎందుకంటే అంతకు మించి ఆయా పాత్రలలో ఎవరినీ ఊహించు కోలేరంటూ పేర్కొన్నారు దర్శకుడు.
మహావతార్ నరసింహా చిత్రం 16వ రోజున రూ.100 కోట్ల మార్క్ ను దాటేసింది. తొలి రోజు రూ. 1.46 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం స్వదేశీ యానిమేటెడ్ సినిమాకు గేమ్-ఛేంజర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Also Read : Hero Rajinikanth Coolie : కూలీ కోసం ఆగస్టు 14న సెలవు


















