అమరావతి : ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా, హైబ్రిడ్ అయినా మహానాడు మాస్ జాతర సూపర్ హిట్. పసుపు పండుగ మహానాడు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి నేను తెలుగు వాడినీ… నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వేదిక మహానాడు. నేషన్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం – మన బాధ్యత. ప్రధాని మోదీ గారు ఇచ్చిన దిశ మనం ఫాలో అవుతున్నాం. నెల్లూరులో భారీగా మహానాడు నిర్వహించాలనుకున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నాం. మనమే హైబ్రిడ్ మోడల్ అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంటా. ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదని ప్రకటించారు నారా లోకేష్.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దేశానికి లెజెండ్. తెలుగువారి ఆత్మ గౌరవం, తెలుగు వారి పౌరుషం ఎన్టీఆర్. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఆయన ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. ట్రెండ్ సెట్ చేశారు. ఆయన రికార్డులు బద్దలు కొట్టడం ఎవరివల్లా సాధ్యం కాదు. దేశానికి సంక్షేమం, అభివృద్ధి పరిచయం చేసింది ఎన్టీఆర్. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లని చెప్పిన మాట మన సిద్ధాంతం. 2 రూపాయలకు కిలో బియ్యం, పెన్షన్, ₹50/ హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం, పటేల్‑పట్వారీ విధానం రద్దు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు వంటివి ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. స్త్రీశక్తిని మొదట గుర్తించింది, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది, మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ పెట్టింది, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది అన్న ఎన్టీఆర్ అని అన్నారు.
















