ధోవ‌ల్ పాత్ర‌లో మాధ‌వ‌న్ న‌ట‌న సూప‌ర్

దురంధ‌ర్ -2 మూవీలో కీల‌క పాత్ర‌కు ప్ర‌శంస‌

Hellotelugu-Madhavan

చెన్నై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దురంధ‌ర్-2 . మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే దురంధ‌ర్ -1 రికార్డ్ బ్రేక్ చేసింది. రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. గ‌తంలో ఇండియాలో జ‌రిగిన దారుణాల‌ను , మోసాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెప్పేందుకు ప్ర‌యత్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ సంద‌ర్బంగా ఇండియ‌న్ జేమ్స్ బాండ్ గా గుర్తింపు పొందాడు భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్. ఆయ‌న పేరుతో ఓ పాత్ర‌ను ప్ర‌త్యేకంగా క్రియేట్ చేశాడు ఆదిత్య ధ‌ర్.

ఈ సంద‌ర్బంగా ఈ పాత్ర‌కు స‌రైన న్యాయం చేశాడు ప్ర‌ముఖ న‌టుడు, కోలీవుడ్ కు చెందిన మాధ‌వ‌న్. ఆయ‌న అద్భుత‌మైన న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీ న‌టులు త‌న న‌ట‌న‌కు ఫిదా అయ్యారు . మాధ‌వ‌న్ కు అభినంద‌న‌లు తెలియ చేస్తున్నారు. జీవితకాలపు గొప్ప పాత్రను పోషించిన మాధవన్ నిజంగా ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ఒక తోటి తమిళుడిగా, సాటిలేని అజిత్ దోవల్ పాత్రలో నటుడు మాధవన్ న‌టించ‌డం గ్రేట్ అన్నారు. సినిమా భారాన్ని మొత్తం తన భుజాలపై మోశాడు. మాధవన్ మరోసారి తాను ఎందుకు ఒక గొప్ప నటుడో దేశభక్తి భావాలు గల ఎందరో యువతకు ఆదర్శప్రాయుడో నిరూపించుకున్నాడు.

Exit mobile version