స‌త్తా చాటిన గుజ‌రాత్ చేతులెత్తేసిన ల‌క్నో

నాలుగు వికెట్ల‌తో చెల‌రేగిన ప్రసిద్ద్ కృష్ణ

hellotelugu-LSGvsGTPL2026

ఉత్త‌ర ప్ర‌దేశ్ : ఐపీఎల్ 2026లో భాగంగా ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ దెబ్బ‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాట‌ర్లు విల విల లాడారు. చేజేతులారా వికెట్లు పారేసుకున్నారు. దీంతో గుజ‌రాత్ 7 వికెట్ల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. లీగ్ లో ప‌డుతూ లేస్తూ వ‌స్తోంది ల‌క్నో. ఇక బౌల‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ కేవ‌లం 28 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన నాలుగు వికెట్ల‌ను కూల్చాడు. ల‌క్నో జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 164 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ మార్క్ ఒక్క‌డే రాణించాడు. త‌ను 30 ర‌న్స్ చేశాడు.

అనంత‌రం మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 18.4 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లు కోల్ప‌యి 165 ర‌న్స్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. త‌ను కేవ‌లం 37 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. 60 కీల‌క‌మైన ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి. త‌న‌తో పాటు గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ 56 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. త‌ను 56 ప‌రుగులు సాధించాడు. ఇక విచిత్రం ఏమిటంటే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌మ స్వంత ఇలాఖాలో బ్యాటింగ్ చేస్తూ వ‌రుస‌గా ఆరోసారి ఓట‌మి పాలు కావ‌డం విస్తు పోయేలా చేసింది. నాలుగు వికెట్లు తీసిన ప్ర‌సిద్ద్ కృష్ణ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Exit mobile version