అమెరికా : ప్రముఖ ప్రపంచ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ సంచలనంగా మారాడు. తను ఈసారి జరిగే వరల్డ్ కప్ ఫుట్ బాల్ టోర్నీలో అర్జెంటీనా తరపున ఆడతాడు. ఈమేరకు తను కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని అర్జెంటీనా మేనేజ్మెంట్ సంచలన ప్రకటన చేసింది. పద్దెనిమిదేళ్ల మాస్టాంటునో అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిభావంతులలో ఒకరిగా మెస్సీ పరిగణించ బడుతున్నాడు. జాతీయ కోచ్ లియోనెల్ స్కలోని తన 26 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తూ తెలిపారు.. 38 ఏళ్ల మెస్సీ, అర్జెంటీనా సూపర్‌స్టార్‌కు రికార్డు స్థాయిలో ఆరో టోర్నమెంట్ కానున్న ఈ టోర్నమెంట్‌లో తాను ఆడతానని ఇంతకు ముందు ధృవీకరించ లేదు. కానీ, ఖతార్‌లో ట్రోఫీని గెలుచుకున్న నాలుగేళ్ల తర్వాత, ఎనిమిదిసార్లు బ్యాలన్ డి’ఓర్ విజేత మళ్లీ అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తాడని విస్తృతంగా ఊహించారు.
రియల్ మాడ్రిడ్ ఆటగాడు ఫ్రాంకో మాస్టాంటునోను అర్జెంటీనా జట్టు నుండి మినహాయించడం గమనార్హం. పద్దెనిమిదేళ్ల మాస్టాంటునో అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిభావంతులలో ఒకడిగా పేరు పొందాడు. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తోంది ఈ వరల్డ్ కప్ పోటీలను. ఇప్పటి వరకు జరిగిన వాటిలో అతిపెద్ద ప్రపంచ కప్ జూన్ 11న ప్రారంభమవుతుంది. అర్జెంటీనా తన మొదటి మ్యాచ్‌ను ఐదు రోజుల తర్వాత కాన్సాస్ సిటీలో అల్జీరియాతో ఆడుతుంది. ఇటీవల కాలంలో మెస్సీ గాయం వెంటాడుతోంది. ఇదే ఆ జట్టును వేధిస్తోంది. అతని క్లబ్ జట్టు ఇంటర్ మయామి ఈ వారం వైద్య పరీక్షలలో అతని ఎడమ తొడ కండరంలో కండరాల అలసట ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది.



















