కోచ్ ప‌ద‌వి కోసం లక్ష్మ‌ణ్ ను సంప్ర‌దించ లేదు

ఖండించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి సైకియా

hellotelugu-BCCISecrtary

ముంబై : బీసీసీఐ కార్య‌ద‌ర్శి సైకియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టెస్టు క్రికెట్ కు సంబంధించి కోచింగ్ ఇచ్చే విష‌యంలో తాము మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ను సంప్ర‌దించిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు. ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న కోచ్ ను మార్చాల‌నే ఉద్దేశం త‌మ‌కు లేద‌న్నారు. అయితే మూడు ఫార్మాట్ ల‌కు వేర్వేరుగా కోచ్ లు ఉండాల‌నేది గ‌తంలో నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. కానీ దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఆలోచించ లేద‌న్నారు. కానీ కొంద‌రు కావాల‌ని ఇలాంటి ప్ర‌చారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. బీసీసీఐ బోర్డు స‌మావేశంలో జ‌రిగిన అంశాల‌కు సంబంధించి స‌భ్య కార్య‌ద‌ర్శి లేదా ఇత‌ర ప‌ద‌వుల‌లో ఉన్న వారు తెలియ చేస్తార‌ని చెప్పారు.

కానీ కొంద‌రు కావాల‌ని త‌మ‌కు తోచిన రీతిలో క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏదైనా జాతీయ అంశానికి సంబంధించి రాసే స‌మ‌యంలో లేదా ప్ర‌సారం చేసే స‌మ‌యంలో వివ‌ర‌ణ తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఆలోచ‌న చేయ‌లేద‌న్నారు బీసీసీఐ కార్య‌ద‌ర్శి సైకియా. ఇదిలా ఉండ‌గా స్వ‌దేశంలో టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌత‌మ్ గంభీర్ ఆధ్వ‌ర్యంలో భార‌త్ ఘోరంగా ఓట‌మి పాలైంది స్వ‌దేశంలో దక్షిణాఫ్రికా జ‌ట్టుతో. 0-2 తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది బ‌వూమా నేతృత్వంలోని స‌ఫారీ టీం. ఇదే క్రమంలో కీల‌క‌మైన మార్పులు చేయ‌డం కూడా ఇబ్బంది క‌లిగించింది. దీంతో గంభీర్ ను మారుస్తున్న‌ట్లు ప్ర‌చారం జోరందుకుంది.

Exit mobile version