Kuldeep Yadav Sensational : ఆసియా క‌ప్ లో కుల్దీప్ యాద‌వ్ నెంబ‌ర్ వ‌న్

7 మ్యాచ్ లలో 17 వికెట్లతో టోర్నమెంట్ లో టాప్

Hello Telugu - Kuldeep Yadav Sensational

Hello Telugu - Kuldeep Yadav Sensational

Kuldeep Yadav : దుబాయ్ : ఆసియా క‌ప్ ముగిసింది. సూర్య కుమార్ సార‌థ్యంలోని టీమిండియా ఛాంపియ‌న్ గా నిలిచింది. ప‌రుగుల ప‌రంగా యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ టాప్ లో నిలిచాడు. త‌ను 7 మ్యాచ్ లు ఆడి 314 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇందులో 75 ర‌న్స్ అత్య‌ధిక స్కోర్. ఇక రెండో ప్లేస్ లో హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ 7 మ్యాచ్ లు ఆడి 213 ప‌రుగులతో ఉన్నాడు. బౌలింగ్ ప‌రంగా కూడా భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్ టాప్ లో నిలవ‌డం విశేషం.ఈ టోర్న‌మెంట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా నిలిచాడు స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ (Kuldeep Yadav). మొత్తం 7 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 120 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

Kuldeep Yadav Viral

జ‌స్ప్రీత్ బుమ్రా 135 ప‌రుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్ , హ‌ర్షిత్ రాణా సైతం స‌త్తా చాటారు. ఇక ఫైన‌ల్ మ్యాచ్ కు గాయ‌ప‌డంతో హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. ఇక ఈ టోర్నీలో ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది శ్రీ‌లంక జ‌ట్టు గురించి. ఆ జ‌ట్టు త‌ర‌పున ఆడిన పాతుమ్ నిస్సాంక దుమ్ము రేపాడు. టీమ్ ఇండియాను షేక్ చేశాడు. సెంచ‌రీ చేసిన ఏకైక క్రికెట‌ర్ గా నిలిచాడు ఈ ఆసియా క‌ప్ లో. ఇండియా బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను 107 ర‌న్స్ చేశాడు. మ‌రో క్రికెట‌ర్ కుశాల్ పెరీరా 146 ప‌రుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట‌ర్ సైఫ్ హ‌స‌న్ నాలుగు మ్యాచ్ లు ఆడి 178 ర‌న్స్ చేశాడు. ఇదిలా ఉండ‌గా 7.43 ఎకానమీతో యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కి చెందిన జునైద్ సిద్ధిక్ మూడు గ్రూప్ మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు.

Also Read : Asia Cup 2025 Tilak Varma Sensational : ఆసియా క‌ప్ లో మెరిసిన శ‌ర్మ‌, వ‌ర్మ

Exit mobile version