KTR Fired on Congress : ఓట్ల చోరీ నిజం ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విరుద్దం

కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై భ‌గ్గుమ‌న్న కేటీఆర్

Hello Telugu - KTR Fired on Congress

Hello Telugu - KTR Fired on Congress

KTR : హైద‌రాబాద్ : రాష్ట్రంలో అడ్డ‌గోలు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ అమ‌లు చేయ‌డంలో ఘోరంగా వైఫ‌ల్యం చెందింద‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఇవాళ తెలంగాణంలోని నాలుగున్న‌ర కోట్ల మంది ప్ర‌జానీకం చూపంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై ఉంద‌న్నారు. ఇప్ప‌టికే స‌ర్కార్ పాల‌నా ప‌రంగా ఫెయిల్ అయింద‌ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మై పోయింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఇక్క‌డ గెలిచేది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనేన‌ని జోష్యం చెప్పారు కేటీఆర్. అంతే కాకుండా అక్ర‌మంగా విజ‌యం సాధించేందుకు అధికార పార్టీ నానా తంటాలు ప‌డుతోంద‌న్నారు. త‌మ పార్టీ శ్రేణుల విచార‌ణ‌లో పెద్ద ఎత్తున న‌కిలీ ఓట్ల బండారం బ‌య‌ట ప‌డింద‌ని చెప్పారు. దీనికి సంబంధించి తాము రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు కూడా చేశామ‌న్నారు.

KTR Slams Congress

ఇందులో భాగంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరుపైన తెలంగాణ భవన్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా గెలిచేది మాత్రం గులాబీ జెండానేన‌ని పేర్కొన్నారు. ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఉప ఎన్నికల సందర్భంగా 23 వేల ఓట్లు పెరిగాయని చెబుతున్నార‌ని, వీటితో పాటు 12 వేల ఓట్లు డిలీట్ చేశామంటున్నార‌ని , ఇక్క‌డే అనుమానం క‌లుగుతోంద‌న్నారు కేటీఆర్. ఏ విధంగా ఓట్లు పెరిగాయి అన్న దానిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి ఎన్నికల కమిషన్ డ్యూటీని తన చేతుల్లోకి తీసుకొని అక్రమంగా ఓటు ఐడీలను పంచారని ఆరోపించారు.

Also Read : YS Vijayamma Shocking to Jagan : జ‌గ‌న్ రెడ్డికి షాక్ విజ‌య‌మ్మ‌కు కోర్టు ఊర‌ట‌

Exit mobile version