KTR : కరీంనగర్ జిల్లా – మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయిస్తామన్నారు. నిన్నైనా, రేపైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో కాంగ్రెస్ విచ్చలవిడి దోపిడి చేస్తోందని ఆరోపించారు. తమవారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కీటెక్స్ సంస్థను బెదిరిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ (KTR). కాంగ్రెస్ నేతల గుండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ అవుతుందన్నారు.
KTR Comments
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు పరకాలలో కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామన్నారు. గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా బహుజనులకు వారి న్యాయమైన వాటాను ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమే.నని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గంలో ఉన్న 55 ఎంపీటీసీల్లో 58 శాతం టికెట్లను అంటే 32 ఎంపీటీసీ స్థానాలను రేవంత్ రెడ్డి నిద్రలో ఉన్నప్పుడే బీసీ సోదరులకు ఇచ్చామని గుర్తు చేశారు.109 సర్పంచులలో 49 స్థానాలను బీసీలకు ఇవ్వడంతో పాటు ఆరు జడ్పీటీసీల్లో 3 స్థానాలు, ఆరు ఎంపీపీలలో 3 స్థానాలను బహుజనులకే ఇచ్చామన్నారు.
దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరించడం దారుణమన్నారు కేటీఆర్. టెక్స్‌టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన 137 కోట్ల రూపాయల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధన దాహంతో 297 కోట్ల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలు 167 కోట్ల రూపాయలు దోచుకోవాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ప్రశ్నించక పోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదన్నారు.
Also Read : Minister Bandi Sanjay Shocking Comments : బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన నిజం


















