KTR Huge Support : పారా అథ్లెట్‌ అర్చనకు కేటీఆర్ ఆస‌రా

శ్రీలంక ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు సాయం

Hello Telugu - KTR Huge Support

Hello Telugu - KTR Huge Support

KTR : హైద‌రాబాద్ : కుట్టు మిషన్ నుండి క్రీడా మైదానం వరకు వెళ్లి అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న తెలంగాణ బిడ్డ మిట్టపల్లి అర్చనకు పూర్తి భ‌రోసా ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను ప్రదర్శించారు. త‌న‌కు ఆర్థిక సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట స్వ‌స్థ‌లం అర్చ‌న‌ది. హైదరాబాద్‌లోని నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిశారు త‌న కుటుంబంతో. ఇదిలా ఉండ‌గా కుట్టుపని చేస్తూ జీవ‌నోపాధి గ‌డుపుతోంది. డిసెంబర్ 8 నుండి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించ‌నుంది త‌ను. పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో త‌న‌ను ఎంపిక చేశారు.

KTR Support Para Athlete Archana

కాగా ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది అర్చ‌న‌. అంత ఆర్థిక స్థోమ‌త లేక పోవ‌డం గురించి తెలుసుకున్నారు స్వ‌యంగా కేటీఆర్. వెంట‌నే స్పందించారు. అర్చ‌న‌ను అభినందించారు. ఆమె ప్రయాణ, క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణా సామగ్రిని కూడా అర్చ‌న‌కు అందజేశారు. దీంతో కేటీఆర్ నుంచి సకాలంలో లభించిన ప్రోత్సాహంతో, అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే అర్చన కల సాకారం కానుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అర్చన కథ ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. చంద్రంపేటలోని ఒక కుట్టు మిషన్ నుండి అంతర్జాతీయ వేదికపైకి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం అన్నారు.

Also Read : K Kavitha Sensational Update : తెలంగాణ జాగృతి సంస్థ ఐటీ వింగ్ ఏర్పాటు

Exit mobile version