KTR : హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సర్కార్ పై. ప్రజా పాలన పేరుతో మోసం చేయడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై త్వరలో పోరుబాట చేపడతామని స్పష్టం చేశారు కేటీఆర్ (KTR). వచ్చే నెల డిసెంబర్ నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఆందోళనలు చేపడతామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థి ఒక యోధుడిగా ఎదగాలని అన్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు ఇచ్చారు.
KTR Key Comments
తెలంగాణ చరిత్రలో దీక్ష దివాస్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచి పోతుందని అన్నారు కేటీఆర్. దీక్ష దివాస్ ని ఘనంగా అన్ని యూనివర్సిటీలు, అన్నీ కాలేజీల్లో నిర్వహించాలని సూచించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తన నివాసంలో విద్యార్థి విభాగం నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ విద్యా రంగానికి స్వర్ణయుగం తీసుకు వచ్చారని, గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తు చేశారు.
Also Read : TG High Court Approved : నెక్కొండ మున్సిపాలిటీకి హై కోర్టు గ్రీన్ సిగ్నల్
















