KTR Fired on Congress Govt : దిగ‌జారిన ప్ర‌తిష్ట కాంగ్రెస్ స‌ర్కార్ అవ‌స్థ‌

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Fired on Congress Govt

Hello Telugu - KTR Fired on Congress Govt

KTR : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. కోల్పోయిన ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారంటూ మండిప‌డ్డారు. ఈ సందర్భంగా ఆయ‌న వ్యంగ్యాస్త్రాల‌లు సంధించారు. గురువారం ఆయ‌న మీడియా తో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఈ విష‌యం గుర్తించి ఓట‌ర్లు జాగ్ర‌త్త‌గా ఓటు వేయాల‌ని సూచించారు కేటీఆర్. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

KTR Slams Congress Govt

జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతున్నదంటూ ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనం అన్నారు . జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన డిపాజిట్‌ను కోల్పోయేలా ప్రజలు చేసినప్పుడు మాత్రమే, 2023లో వారు ఇచ్చిన ఆరు హామీలు, 420 వాగ్దానాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రారంభిస్తుంద‌ని హిత‌వు ప‌లికారు. ప్ర‌జ‌లు త‌మ విలువైన ఓటుతో కాంగ్రెస్ కు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్.

Also Read : CM Chandrababu Strong Focus : స‌హాయ‌క చ‌ర్య‌లపై చంద్ర‌బాబు ఆరా

Exit mobile version