KTR : హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహించచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). సీఎం రేవంత్ ప్రభుత్వ నిర్వాకంతో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆవేదన చెందారు. సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన కీలక సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్ కొనసాగుతోందని ఆరోపించారు. రేవంత్ పాలనలో హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ మరింత పెరిగిందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలు కావాలని అన్నారు.
KTR Slams Congress Govt
రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సిఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు, కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను చెల్లించామన్నారు.
2014లో అధికారంలోకి వచ్చినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెల్లించామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవన్న సాకుతో పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదని విమర్శించారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చు అవుతున్నాయని , రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సిఎం చెప్పడం సిగ్గుచేటు అన్నారు.. కాలేజీల బంద్‌ను ఆపి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read : Mohammed Siraj Growth : సిరాజ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డ్

















