త్వ‌ర‌లో మ‌రిన్ని వికెట్లు ప‌డ‌డం ఖాయం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-KTR

హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పై సుప్రీంకోర్టు అన‌ర్హ‌త వేటు వేసింది. ఈ సంద‌ర్బంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్ర‌స్తుతం ఒక వికెట్ ప‌డింద‌ని, త్వ‌ర‌లోనే మ‌రికొన్ని వికెట్లు ప‌డ‌డం ఖాయ‌మ‌న్నారు. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా త‌మ పార్టీ గుర్తుపై గెలిచి, త‌మ వ్య‌క్తిగ‌త ప‌నులు, అవ‌స‌రాల కోసం అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరార‌ని ఆరోపించారు. తాము ఎన్నికైన ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా బీఆర్ఎస్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీ జ‌పం చేస్తే ఎవ‌రూ ఊరుకోర‌ని హెచ్చ‌రించారు. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు సీఎం రేవంత్ రెడ్డి పెట్టింది పేర‌ని, త‌ను ఎన్ని ర‌కాలుగా ఎమ్మెల్యేల‌ను మ‌భ్య పెట్టాల‌ని చూసినా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు కేటీఆర్.

ఇక‌నైనా త‌మ పార్టీ నుంచి వెళ్లి పోయి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు త‌ప్ప‌కుండా రాజీనామా చేయాల్సిందేన‌ని, ఉప ఎన్నిక‌లు రావ‌డం ఖాయ‌మై పోయింద‌న్నారు . ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు రాజ్యాంగం ప‌ట్ల‌, ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల న‌మ్మ‌కం, గౌర‌వం ఉంద‌న్నారు మాజీ మంత్రి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మ‌క‌మ‌ని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు దిమ్మ తిరిగేలా తీర్పు చెప్పార‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ అనర్హతను హైకోర్టు ధృవీకరించగా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఆయన అనర్హత నుండి తప్పించుకునే ప్రయత్నాన్ని తిరస్కరించింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఫిరాయింపుల ద్వారా ప్రజా తీర్పును దొంగిలించి, స్పీకర్ వెనుక దాక్కోవచ్చని భావించార‌న్నారు. మూడేళ్ల ద్రోహం, ఇచ్చిన మాట తప్పడం, దుష్పరిపాలనపై ఖైరతాబాద్ ప్రజలు త్వరలో తమ తీర్పును ఇవ్వనున్నార‌ని పేర్కొన్నారు.

Exit mobile version