రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధి

వెల్ల‌డించిన ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్

hellotelugu-AmaravathiTechonolgy

అమ‌రావ‌తి : రాష్ట్రంలో 23 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. స్పేస్, డ్రోన్లు, సిమెంట్, స్టీల్, మెడికల్ డివైసెస్, ఫార్మా, ఏఐ, డేటా నుంచి హార్టికల్చర్, ఆక్వా రంగాల వరకు విస్తరించాయని తెలిపారు. వర్టికల్, హారిజాంటల్ విధానంలో ముందుకు వెళ్తున్నాం అన్నారు . ఒక పూర్తిస్థాయి నౌకను తయారు చేయడానికి సుమారు 360 కంపెనీల అవసరం ఉంటుందన్నారు. ఫైర్‌ఫైటింగ్ పరికరాలు, నావిగేషన్ పరికరాలు, లైటింగ్, మెటీరియల్ సైన్సెస్ వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీలు కలిసి ఒక షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను తయారు చేస్తాయని చెప్పారు. ఇలాంటి 23 క్లస్టర్లను మేం అభివృద్ధి చేస్తున్నాం అని వెల్ల‌డించారు నారా లోకేష్. వీటిని వర్టికల్స్ అంటారు. ఇక హారిజాంటల్ విధానంలో మానవ వనరుల అభివృద్ధి విభాగం వస్తుందన్నారు.

ఆయా క్లస్టర్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు నారా లోకేష్‌. సర్టిఫికేషన్, టెస్టింగ్, వాలిడేషన్ వ్యవస్థలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. స్కైరూట్ ఇందుకు ఉదాహరణ అని, ఏడాది క్రితమే మేం స్కైరూట్‌పై నమ్మకం ఉంచాం అని పేర్కొన్నారు. వారికి 300 ఎకరాల భూమిని ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చామ‌న్నారు. వారు తమ ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి, మన లాంచ్‌ప్యాడ్‌కు సమీపంలో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ భూమిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా స్పేస్ సిటీని నిర్మిస్తున్నాం. అదే విధంగా సాగర్ డిఫెన్స్ అనే మరో సంస్థతో కూడా ఇదే విధానాన్ని అనుసరించాం. వారు సముద్ర సంబంధిత డ్రోన్లను తయారు చేస్తున్నారు. వారు మా వద్దకు వచ్చినప్పుడు వారి విలువ సుమారు రూ.3వేల కోట్లు ఉండేది. ఇప్పుడు అది రూ.23 వేల కోట్లకు చేరింద‌న్నారు నారా లోకేష్‌. ఈ మార్పు కేవలం 18 నుంచి 24 నెలల్లోనే జరిగింది. క్లస్టర్ ఆధారిత విధానం గొప్ప ఫలితాలను ఇస్తోందన్నారు.

Exit mobile version