CM Chandrababu : అమరావతి – సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu).79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అనేక ఎత్తుపల్లాలను చూసిందన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఇలా ప్రతిసారీ కొత్త సవాళ్లతో రాష్ట్ర ప్రయాణం సాగిందని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి అనే NDA నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చారని చెప్పారు. నిశబ్ద విప్లవాన్ని సృష్టించారని కొనియాడారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Key Comments on AP Development
రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించామన్నారు. మేం అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్‌కు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పని చేస్తున్నాం అన్నారు. నేను ఈ రోజు సవినయంగా, సగర్వంగా చెబుతున్నా, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్దికి అడ్డులేదు, సుపరిపాలనకు పోటీ లేదన్నారు. ఇది రికార్డ్. ఇదే ఆల్ టైం రికార్డ్ అని స్పష్టం చేశారు సీఎం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోందని చెప్పారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటివద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చామన్నారు.
తన బిడ్డ చదువు కోవాలని కలలుకనే పేదింటి తల్లులకు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసుకువచ్చాం. రూ.10 వేల కోట్లతో పథకాన్ని అమలు చేశామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం లో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించామని వెల్లడించారు. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నారు. ఏటా రూ.2,684 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇప్పటికి 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నామని తీపి కబురు చెప్పారు.
Also Read : PM Modi – India Growth : జీఎస్టీ సంస్కరణలపై కీలక వ్యాఖ్యలు..లక్ష కోట్లతో కొత్త ఆవిష్కరణ
