KTR Shocking Comments : కవిత సస్పెన్షన్ పై కేటీఆర్ కామెంట్స్

ఎవ‌రైనా గీత దాటితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

hellotelugu-ktr

KTR : హైద‌రాబాద్ : త‌న స్వంత చెల్లెలు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై బీఆర్ఎస్ బాస్ వేటు వేయ‌డం ప‌ట్ల మౌనం వీడారు మాజీ మంత్రి, సోద‌రుడు కేటీఆర్ (KTR). ఈ సంద‌ర్బంగా ఆయ‌న న‌ర్మ గ‌ర్భంగా మాట్లాడారు. గీత దాటితే ఎవ‌రైనా స‌రే చివ‌ర‌కు తానైనా స‌రే చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని, ఇది తాను తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని పేర్కొన్నారు. త‌మ పార్టీ బాస్, మాజీ సీఎం, త‌న తండ్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌య‌మ‌న్నారు. దీనిని కాద‌నే హ‌క్కు, అభ్యంత‌రం తెలిపే ఛాన్స్ త‌న‌కు ఉండ‌ద‌న్నారు. తాను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ను మాత్ర‌మేన‌ని ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునే అధికారం త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

KTR Key Comments on Kavitha Suspension

క‌విత‌పై వేటు వేసిన కొంత కాలానికి స్పందించ‌డం విస్తు పోయేలా చేసింది. ఏదైనా చర్చించాల్సి వస్తే, పార్టీలో చర్చించి చర్య తీసుకున్నారు. ఒకసారి చర్య తీసుకున్న తర్వాత, నేను జోడించడానికి లేదా వ్యాఖ్యానించడానికి ఇంకేమీ లేదంటూ స్ప‌ష్టం చేశారు కేటీఆర్. కాగా గత వారం కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే శాసనమండలి సభ్యురాలిగా రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ లో విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత ఆమె రాజీనామా చేశారు.

కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి కేసీఆర్‌పై ఆదేశించిన సీబీఐ దర్యాప్తున‌కుహ‌రీశ్ రావు, సంతోష్ రావులే కార‌ణ‌మ‌మ‌ని క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : Karnataka BJP Shocking Complaint : క‌ర్ణాట‌క స‌ర్కార్ పై అమిత్ షాకు ఫిర్యాదు

Exit mobile version