Karnataka BJP : ఢిల్లీ : కర్ఖాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర హొం శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసింది. ధర్మస్థల హత్య కేసులు, గణేష్ విసర్జన్ ఊరేగింపు హింస . హిందూ వ్యతిరేక విధానం గురించి వివరించారు. షాను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కర్ణాటక బీజేపీ (Karnataka BJP) అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర. ధర్మస్థల సమస్యకు సంబంధించి కుట్ర ఎలా జరుగుతుందో, ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులపై ప్రభుత్వం సరైన దర్యాప్తు నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని అమిత్ షాకు చెప్పామన్నారు.
Karnataka BJP Complaint to Amit Shah
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్ష నాయకులు ఆర్. అశోక, చలవాడి నారాయణస్వామి, బిజెపి ఎంపీలు కోట శ్రీనివాస్ పూజారి, బ్రిజేష్ చౌతా, బెల్తంగడి ఎమ్మెల్యే హరీష్ పూంజా, ధర్మస్థల చలో ప్రచార నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.ఆర్. విశ్వనాథ్, దక్షిణ కర్ణాటక జిల్లా అధ్యక్షుడు సతీష్ కుంపాల్ లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందంలో ఉన్నారని చెప్పారు విజయేంద్ర.
ప్రధానంగా ధర్మస్థల సమస్య, మంగళూరులో హిందూ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య, కొప్పల్‌లో వాల్మీకి సమాజానికి చెందిన మరో హిందూ కార్యకర్త గవిసిదప్ప హత్య, రాష్ట్రంలో నిరంతరం శాంతిభద్రతలు దెబ్బతినడం, క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై క్యాబినెట్‌లో ఉన్న అనేక కేసులను రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఉపసంహరించు కోవడంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా కూలి పోయిందన్నారు.
Also Read : TSUTF Shocking Statement : టెట్ తప్పనిసరి అంటే ఒప్పుకోం : యుటిఎఫ్
