KTR Fired on BJP : బీజేపీ దేశ‌భ‌క్తి బ‌క్వాస్ : కేటీఆర్

భార‌త్, పాకిస్తాన్ షేక్ హ్యాండ్ వివాదం

Hello Telugu - KTR Fired on BJP

Hello Telugu - KTR Fired on BJP

KTR : హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. బీజేపీ దేశ‌భ‌క్తి అనేది బ‌క్వాస్ అని కొట్టి పారేశారు. తాజాగా దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025 లో ఇండియా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ నిర్వ‌హించ‌డం దారుణ‌మ‌న్నారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ కు వ్యాపార ప్ర‌యోజ‌న‌లే త‌ప్పా దేశ ఆత్మ గౌర‌వం ముఖ్యం కాద‌న్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది ఇండియా దాయాది దేశంతో మ్యాచ్ ఆడ‌డం ప‌ట్ల‌. బాధిత కుటుంబాలు కూడా సీరియ‌స్ గా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలో, మ్యాచ్‌లను కొనసాగించడానికి అనుమతించినందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

KTR Slams BJP

సామాజిక వేదిక ద్వారా నిప్పులు చెరిగారు కేంద్రాన్ని. తీవ్ర పదాలతో విరుచుకు ప‌డ్డారు. బిజెపిని సిగ్గులేని వంచన అని ఆరోపించారు. ఐదు నెలల క్రితం, పాక్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు ఊచకోత కోయబడ్డారు. అయినప్పటికీ మన జాతీయ జట్టు మన గడ్డపై ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న దేశానికి వ్యతిరేకంగా క్రికెట్ ఆడటం పట్ల అధికార బిజెపికి ఎటువంటి అభ్యంతరం లేదంటూ మండిప‌డ్డారు కేటీఆర్. ఊహించినట్లుగానే వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వును బిఆర్ఎస్ పార్టీ స్వాగతించడంతో కొంతమంది బిజెపి మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. వారు భారత రాజ్యాంగాన్ని లేదా సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు.

Also Read : Pakistan Sensational : ఆసియా క‌ప్ నుంచి పాకిస్తాన్ త‌ప్పుకుంటుందా..?

Exit mobile version