KTR : హైదరాబాద్ : పత్తి పండించే రైతుల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నాయంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
పత్తి కొనుగోలు సంక్షోభంపై ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఈ అంశంలో వెంటనే కేంద్రం పైన ఒత్తిడి తీసుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెంటనే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిరాకరిస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆరుగాలం శ్రమించే రైతుల పట్ల వివక్ష తగదన్నారు.
KTR Slams State and Union Govt
కనీస మద్దతు ధర కూడా పత్తి రైతుకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు కొనుగోలు మాత్రమే ఇప్పటి వరకు చేశారని, కానీ 28 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ గా ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోలు సంక్షోభానికి నిదర్శనం అన్నారు కేటీఆర్. ఈ అంశంలో రైతులకు న్యాయం చేసేందుకకు తక్షణమే కార్యాచరణ చేపట్టాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకు పోయారని ఇటు వైపు కన్నెత్తి చూడక పోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Justice Gavai Important Comments : హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకు సమ ప్రాధాన్యం


















