KTR Shocking Comments on CM : సీఎం రేవంత్ రెడ్డికి ఎర్ర‌గ‌డ్డ ఆస్ప‌త్రి బెట‌ర్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

hellotelugu-ktr

KTR : ఖ‌మ్మం జిల్లా – మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌ను పిచ్చోడు అయ్యి రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరగక ముందే ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చూపించాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. ఒక కిట్టి పార్టీ ఆంటీ లాగా తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు. ఎక్కడో ఎవరో చెప్పింది విని దానికి పది మందిని పోగేసుకొని చిట్ చాట్ పేరిట చిల్లర మాటలు మాట్లాడటం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు. సీఎంకు ఎర్ర‌గ‌డ్డ‌లోని పిచ్చాసుప‌త్రి క‌రెక్ట్ అంటూ ఎద్దేవా చేశారు. ప‌దే ప‌దే వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ పోతే చివ‌ర‌కు జ‌నం త‌న‌ను ఛీ కొట్టే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు కేటీఆర్.

KTR Slams CM Revanth Reddy

శుక్ర‌వారం కేటీఆర్ (KTR) ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న గ్యారంటీలను వివరించారు. అనుముల బ్రదర్స్ కోసం భూదందా గ్యారంటీ , చంద్రబాబుకు బనకచర్ల గ్యారంటీ, రాహుల్ గాంధీ కోసం మూటలు గ్యారంటీ,
బావమరిది కోసం అమృత్ స్కాం గ్యారంటీ, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం గ్యారంటీ ,నెలకు 4-5 సార్లు డిల్లీకి పోవుడు గ్యారంటీ అమ‌లు చేస్తున్నాడంటూ ఆరోపించారు. కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, ఇంకొన్ని రోజులు కాళేశ్వ‌రం, పార్ములా ఈ కార్ రేసు, డ్ర‌గ్స్ ఇలా రోజులు గ‌డుపుతూ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేశాడ‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

మన్ను మశానం, వాడి బొంద.. ఇవి తప్ప ప్రజలకు పనుకొచ్చే ఒక్క మాట మాట్లాడిండా అంటూ సంచ‌ల‌న కామెట్స్ చేశారు. తాను నారా లోకేష్ ను క‌ల‌వ‌లేద‌ని అన్నారు. తాను ఏది చేసినా బాజప్తా చేస్తా న‌ని చీక‌ట్లో చేయ‌నంటూ చెప్పారు కేటీఆర్. లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు ఒకవేళ కలిస్తే తప్పేంటి.. లోకేష్ ఏమైనా రేవంత్ రెడ్డి సంచులు మోసిన దొంగ కాదుగా, లోకేష్ నీలాగా చదువు రాని వాడు కాదుగా అంటూ ప్ర‌శ్నించారు. భట్టి విక్రమార్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ సీఎం చేయిస్తున్నాడ‌ని ఆరోపించారు.

Also Read : Ashok Gajapathi Raju Exclusive : టీడీపీ స‌భ్య‌త్వానికి అశోక్ గ‌జ‌ప‌తి రాజు రాజీనామా

Exit mobile version