KTR : హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ కొనసాగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఒకే అపార్ట్మెంట్ లో 40కి పైగా ఓటర్లు ఉన్నారని, ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఇదే సమయంలో మైదానంలో పరుగుల వరద పారించి రికార్డులు సృష్టించిన అజారుద్దీన్ కు తన స్వంత పార్టీలోనే డకౌట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నానంటూ ఆశ చూపించిన రేవంత్ రెడ్డి చివరకు జూబ్లీ హిల్స్ లో టికెట్ ఇవ్వకుండా చేయి ఇచ్చాడని అన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా ఇంకా నమ్మడం దారుణమన్నారు.
KTR Comments
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడన్నారు కేటీఆర్. అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడ నీయకుండా ఒక పేపర్ మీద ఎమ్మెల్సీ అని రాసి బకరాను చేశాడన్నారు. అజారుద్దీన్‌కు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ కోర్టులో నిలబడదన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. షేక్‌పేట్‌లో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం అని ఇస్తున్నానని అబద్దం చెప్పాడన్నారు. తిరిగి అక్కడికి వెళ్లే సరికి ఇది తమ స్థలం అంటూ ఆర్మీ వాళ్లు రంగంలోకి దిగేసరికి జరిగిన మోసం చూసి విస్తు పోయారన్నారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ నమ్మించాడని, చివరకు బీసీలను కూడా మోసం చేశాడన్నారు.
Also Read : CM Chandrababu – AP Growth : ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే విశాఖ సదస్సు















