KTR Important Meet to Mogulayya : ప‌ద్మ‌శ్రీ మొగుల‌య్య‌కు కేటీఆర్ భ‌రోసా

కేటీఆర్ నివాసంలో క‌లిసిన క‌ళాకారుడు

Hello Telugu - KTR Important Meet to Mogulayya

Hello Telugu - KTR Important Meet to Mogulayya

KTR : హైద‌రాబాద్ : తాను ఇబ్బందుల్లో ఉన్నాన‌ని, ఆదుకోవాల‌ని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ను క‌లిశారు ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత మొగుల‌య్య‌. ఈ సంద‌ర్బంగా త‌న‌కు పూర్తి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు కేటాయించిన ఇంటి స్థ‌లం స‌మ‌స్య ఉంద‌ని, కంటి శ‌స్త్ర చికిత్స‌కు ఇబ్బంది ఏర్ప‌డింద‌న్నారు. ఆప‌రేష‌న్ తాను చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా మొగులయ్య ఇంటి స్థలం సమస్యపై కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్ చేశారు. గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంత మంది వ్యక్తుల నుండి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని వాపోయారు. కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు మొగులయ్య.

Mogulayya Meet Ex IT Minister KTR

గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను కట్టుకున్న గోడలను ఇంటిని కూడా కులగొట్టార‌ని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లిన తనకు పరిష్కారం దొరకలేదని అన్నారు. తనకు అండగా నిలవాలని కోరగా.. దీనిపై తక్షణమే స్పందించారు కేటీఆర్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు.

Also Read : Deputy CM Pawan Clear Update on Water : ప్ర‌తి ఇంటికీ రక్షిత తాగు నీరు అందిస్తాం

Exit mobile version