హైదరాబాద్ : గత కొంత కాలంగా ఎలాంటి హిట్స్ లేకుండా నిరాశకు గురైన నటుడు వరుణ్ తేజ్ కు బిగ్ రిలీఫ్ లభించేలా చేసింది తాజాగా తాను నటించిన కొరియన్ కనకరాజు చిత్రంతో. తాజాగా విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు దీనిని చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సినిమా వసూళ్లు కూడా ఆశాజనకంగా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది మూవీ టీం. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ తన గత చిత్రాల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమాతో మంచి ఓపెనింగ్స్ సాధించగలిగారు. ఒక ప్రముఖ ఎగ్జిబిటర్ తెలిపిన వివరాల ప్రకారం భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ప్రీమియర్లతో కలిపి సుమారు రూ. 8 కోట్ల కు పైగా షేర్ వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు.
అయితే సినిమా సురక్షితమైన స్థితికి చేరాలంటే పని దినాల్లో కూడా వసూళ్లను నిలకడగా కొనసాగించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వరుణ్ తేజ్ తన గత చిత్రాల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సినిమాతో మంచి ఓపెనింగ్స్ సాధించగలిగారు. ఆయన వైవిధ్య భరితమైన నటన సినిమా జోరును కొనసాగించడంలో సహాయపడినట్లు కనిపిస్తోంది; ఈ హారర్-కామెడీ చిత్రం మొదటి రోజు రూ. 3.16 కోట్లు, రెండో రోజు రూ. 3.12 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రం వారాంతాన్ని బలమైన వసూళ్లతో ముగించే దిశగా సాగుతోంది.ఈ సినిమా రూ. 12 కోట్లకు వ్యాపారం జరుపుకుంది, త్వరలోనే పెట్టుబడిని తిరిగి రాబట్టే అవకాశం ఉంది సదరు డిస్ట్రిబ్యూటర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
